Job : ఏపీలో 2,213 జాబుల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌ప‌డండి..

Job : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ రెండు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 2,213 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. వీటిల్లో ఓ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి కోసం ఏపీలోని జిల్లాలను అనుసరించి జిల్లాకో ప్రత్యేక నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా 1317 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు సిద్ధపడింది. […].

By: jyothi

Published Date - Wed - 1 December 21

Job  : ఏపీలో 2,213 జాబుల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌ప‌డండి..

Job : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ రెండు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 2,213 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. వీటిల్లో ఓ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి కోసం ఏపీలోని జిల్లాలను అనుసరించి జిల్లాకో ప్రత్యేక నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా 1317 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు సిద్ధపడింది.


ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చూస్తోంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 5 తో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. వీటిల్లో టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఫీమేల్ నర్సింగ్, సానిటరీ అటెండర్ వంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసే ముందు ఒక సారి నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ 1317 మొత్తం పోస్టుల్లో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు మొత్తం 839 ఉన్నాయి. వీటికి పదో తరగతి అర్హతగా ఉంది. కనుక చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. 2021 జూలై వరకు అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఇందులో ఎంపికైతే నెలకు 12,000 రూపాయల వేతనం లభించనుంది. కావున ఈ పోస్టులకు అప్లై చేయడం చాలా అవసరం.


job

job



ఇక ఫార్మాసిస్ట్ పోస్టుల విషయానికి వస్తే అందులో 17 పోస్టులు ఉన్నాయి. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ కౌన్సిల్ లో ఈ పోస్టులు అప్లై చేసే వారు రిజిస్టర్ అయి ఉండి ఉండాలి. వీరికి కూడా అర్హత వయస్సును 42 సంవత్సరాలుగా నిర్ణయించారు. వీరికి స్టార్టింగ్ లోనే నెలకు 28,000 రూపాయల వేతనంలభించనుంది.


ఇక మరో వైపు ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు కూడా 10 వ తరగతిత పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ అయి ఉంటే సరిపోతుంది. కావున ఈ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఇక మరో నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో 896 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియ ముగిసే వరకు పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags

Related News