Star Director Gave Life Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదు. ఇంతటి స్టార్ స్టేటస్ ను తెచ్చుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎంత నందమూరి వారసుడు అయినా సరే ఆయన ట్యాలెంట్ తోనే ఆయన ఈ స్థాయికి వచ్చాడు.
అయితే ఆయన ఇంత పెద్ద హీరో కావడానికి కారణం ఓ వ్యక్తి ఉన్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తాను నటించిన విశ్వామిత్రుడు సినిమాలో ఒకపాత్రను జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చారు. ఆ సమయంలో తారక్ నటన చూసిన సీనియర్ ఎన్టీఆర్.. కచ్చితంగా పెద్దయ్యాక హీరో అవుతాడని భావించారంట. అందుకే వెంటనే రాఘవేంద్ర రావును పిలిచి మాట తీసుకున్నారంట.
నా మనవడిని 18 ఏండ్లు అయ్యాక కచ్చితంగా సినిమాల్లోకి తీసుకురావాలని చెప్పారంట. ఆయన మాట ప్రకారమే రాఘవేంద్ర రావు జూనియర్ 18 ఏండ్లు వచ్చాక.. రామోజీ రావుకు పరిచయం చేశారు. రామోజీ నిర్మించిన నిన్ను చూడాలని అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
Star Director Gave Life Junior NTR
ఆ తర్వాత తన శిష్యుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి సినిమాల్లో అవకాశం ఇప్పించింది కూడా రాఘవేంద్ర రావు. ఆ రెండు సినిమాల వల్లే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు. అంటే ఒక రకంగా రాఘవేంద్ర రావు వల్లే ఇంత పెద్ద హీరో అయ్యాడన్న మాట.
Also Read : Naga Chaitanya Bold Comments On Heroines : ఎంత మందికి లిప్ లాక్ ఇచ్చానో నాకే తెలియదు.. చైతూ బోల్డ్ ఆన్సర్..!