Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె టాలీవుడ్ చందమామ. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్టే. ఒక రకంగా చెప్పాలంటే కాజల్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గానే నిలిచాయి. అందుకే హీరోలు హిట్ కావాలంటే కచ్చితంగా కాజల్ ను తీసుకునేవారు.
తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా అగ్ర హీరోలందరితో కలిసి నటించిన రికార్డు ఆమెకే ఉంది. అయితే కెరీర్ పరంగా ఆమెపై ఎలాంటి వివాదాలు లేవు. ఎలాంటి కాంట్రవర్సీలకు అయినా ఆమె దూరంగానే ఉంటుంది. కానీ కాజల్ ఎంటైర్ కెరీర్ లో ఒకే ఒక్క హీరోతో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి.
ఆయన ఎవరా అనుకుంటున్నారా.. మన డార్లింగ్ ప్రభాస్. వీరిద్దరూ కలిసి మిస్టర్ పర్ ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో నటించారు. అయితే డార్లింగ్ సినిమా సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన వారంతా వీరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు స్ప్రెడ్ చేశారు. ప్రభాస్ కు సరైన జోడీ అంటే కాజల్ మాత్రమే అంటూ కామెంట్లు చేశారు.
వాటిపై ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కాజల్ స్పందించింది. నా ఎంటైర్ కెరీర్ లో అలాంటి రూమర్లు కేవలం ప్రభాస్ తో మాత్రమే వచ్చాయి. దాన్ని నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. జస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
Read Also : Kalyan Dev : శ్రీజతో విడాకులు.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిన కల్యాణ్ దేవ్.. ఫ్యాన్స్ కు షాక్..!
Read Also : Nidhhi Agerwal : ఆడిషన్స్ కు పిలిచి ప్రైవేట్ పార్టులు చూపించమన్నాడు.. నిధి అగర్వాల్ కామెంట్లు..!