Kalyan Dev : గత కొన్ని నెలలుగా మెగా డాటర్ శ్రీజకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన రెండో భర్త కల్యాణ్ దేవ్ తో దూరంగా ఉంటుందని, ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే ఆమె చాలా కాలంగా ఒంటరిగానే వెకేషరలు, టూర్లకు వెళ్తోంది. ఒంటరిగానే తన పిల్లలతో కలిసి ఈవెంట్లు, ఫంక్షన్లకు కూడా వెళ్తోంది.
దాంతో కల్యాణ్ దేవ్ తో నిజంగానే విడాకులు తీసుకుందేమో అంటున్నారు. ఇక కల్యాణ్ దేవ్ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. కానీ ఆయన తాజాగా చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. తన కూతురు నివిష్కతో దిగిన ఫొటోలను పోస్టు చేశారు. నేను వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
Kalyan Dev Gave Clarity On Sreeja Konidela Divorce
నిజానికి విడాకులు తీసుకునే సమయంలో పిల్లలు ఎక్కడ ఉండాలి, ఒకరి సమక్షంలో ఉంటే మరొకరితో ఎన్ని గంటలు గడపాలి, ఎప్పుడు గడపాలి అనే రూల్స్ పెడుతుంది కోర్టు. ఇప్పుడు శ్రీజ దగ్గరే నిశ్విక ఉంటుంది కాబట్టి కల్యాణ్ దేవ్ తో నాలుగు గంటలు గడిపే ఛాన్స్ ఇచ్చిందేమో అంటున్నారు నిపుణులు.
వారానికి నాలుగు గంటలు నివిష్కతో గడుపుతున్నాడు కల్యాణ్ దేవ్. దీన్ని బట్టి ఇద్దరూ విడాకులు తీసుకున్నారని అర్థం అవుతోంది. మొత్తానికి ఇలా పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు కల్యాణ్ దేవ్. ఇక శ్రీజకు మూడో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
Read Also : Tamannaah Bhatia : తమన్నా లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Prabhu Deva : వామ్మో.. ప్రభుదేవా ఇంత మందితో ఎఫైర్ నడిపాడా.. మామూలోడు కాదురోయ్..!