Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ నడుమ సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కానీ త్వరలోనే ఆమె వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా తనకు రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే. అది తప్ప ఆమె ఇంకే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.
ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నా సరే ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ జనరేషన్ లో నటనలో సాయిపల్లవిది వేరే లెవల్. ఎందుకంటే ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె పలికించే ఎక్స్ ప్రెషన్లు వేరేలా ఉంటాయి. ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్లకే అందరూ కనెక్ట్ అవుతారని చెప్పుకోవాలి.
అంతగా నటనపై పట్టు ఉన్న సాయిపల్లవికి ఓ హీరో అంటే చాలా ఇష్టం అంట. ఆమె ఇప్పటికే చాలామంది హీరోలతో నటించినా సరే.. కేవలం ఆ హీరోను మాత్రమే ఆమె ఇష్టపడుతుంది. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా.. విశ్వనటుడు కమల్ హాసన్. చిన్నప్పటి నుంచి సాయిపల్లవి ఆయనకు పెద్ద అభిమాని.
కమల్ హాసన్ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను సాయిపల్లవి ఎప్పటికప్పుడు తన వద్ద దాచుకుంటుందంట. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ జ్యోతిక అని తెలిపింది. కమల్ హాసన్ పక్కన నటించానలి ఉందని, కానీ ఆ కోరిక నెరవేరుతుందో లేదో అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ఆమె వెండితెరపై కనిపించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also : Ileana D’Cruz : టాలీవుడ్ హీరోలే కమిట్ మెంట్ అడిగారు.. ఇలియానా షాకింగ్ కామెంట్లు..!
Read Also : Samantha : సమంతలో అది నాకు చాలా ఇష్టం.. అందుకే పెళ్లి చేసుకున్నాః నాగచైతన్య