Kangana Ranaut Accused Bollywood Star Heroes : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె చేసే కామెంట్లు బాలీవుడ్ ను కుదిపేస్తుంటాయి. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో ఎవరూ చెప్పలేరు. నిత్యం స్టార్ హీరోలు, డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను అందరూ కాంట్రవర్సీ క్వీన్ అంటూ పిలుస్తారు.
తనను ఎంత మంది టార్గెట్ చేసినా సరే ఆమె మాత్రం అస్సలు వెనక్కు తగ్గదు. అందరినీ ఏకి పారేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా కంగనా రనౌత్ మరోసారి స్టార్ హీరోల మీద రెచ్చిపోయింది. బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే హీరోలను సంతోషపెట్టాలి. ఆ సినిమాకు పని చేస్తున్న ప్రముఖులను సాటిస్ ఫై చేయాలి.
అప్పుడే సినిమాల్లో ఛాన్సులు ఇస్తారు. కొందరు హీరోలు కావాలనే అసభ్యకరంగా టచ్ చేస్తూ లొంగదీసుకోవాలని చూస్తారు. నేను కూడా చాలామంది హీరోలతో ఇలాంటి అనుభవం చూశాను. క్యారవాన్ లో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు లేదంటే ఫ్రెండ్లీగా డ్యాన్స్ చేసేటప్పుడు కావాలనే అసభ్యకరంగా టచ్ చేస్తూ బిహేవ్ చేస్తారు.
మనల్ని ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని చూస్తారు. పాయల్ ఘోష్ లాంటి వారు ఇప్పటికే ఇలాంటివి బయట పెట్టారు. పెద్ద సినిమాలు చేసినంత మాత్రాన పెద్ద హీరోలు కారు. కాస్త మానవత్వం కూడా నేర్చుకోండి అంటూ చురకలు అంటించింది కంగనా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.