Kangana Ranaut Accused Karan Johar On Casting Couch : బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఎవరూ ఊహించలేనంత స్టార్ డమ్ ను పొందింది. కానీ మాటలతో ఎప్పటికప్పుడు అందరికీ శత్రువు అయిపోతూ ఉంటుంది ఈ భామ.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోల మీద ఆమె చేసే కామెంట్లు ఎంతగా దుమారం రేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఆమె మరో ప్రముఖ నిర్మాతపై సంచలన కామెంట్లు చేసింది. ఆయన ఎవరో కాదు కరణ్ జోహార్. బాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా ఆయన రేంజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒక రకంగా ఆయన బాలీవుడ్ దిల్ రాజు లాంటి వ్యక్తి.
ఆయన మీద తాజా ఇంటర్వ్యూలో ఆమె కామెంట్లు చేసింది. బ్రహ్మాస్త్ర మూవీని మీరు ఎందుకు విమర్శించారు అని అడగ్గా.. కంగనా స్పందిచింది. ఆ సినిమా నిర్మాత కరణ్ జోహార్ చేసే పనులు అలాగే ఉంటాయి. అతనికి సినిమాల కన్నా కూడా ఇతరులతో శృంగారం మీదనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
అతనితో శృంగారం చేసిన వారికే తన సినిమాల్లో ఛాన్సులిస్తాడు. పైగా ఇతరుల శృంగార జీవితాల గురించి ఆరా తీస్తుంటాడు. అలాంటి వ్యక్తి తీసే సినిమాలు గొప్పగా ఎందుకు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీని తప్పుబట్టే వారిని నేను ఇలాగే విమర్శిస్తాను అంటూ దుమారం రేపే కామెంట్లు చేసింది కంగనా.