Kangana Ranaut Controversial Comments : సౌత్ లో శ్రీరెడ్డి లాగా.. బాలీవుడ్ లో కంగనా రనౌత్ కూడా అప్పుడప్పుడు తీవ్ర వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్న ఆమె.. చేసే కామెంట్లు మాత్రం అగ్గి రాజేసేలా ఉంటాయి. అనవసరంగా చేస్తుందో లేదంటే కావాలనే చేస్తుందో అర్థం కాదు కానీ.. ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని రేపుతుంటాయి.
తాజాగా కంగనా రనౌత్ మరోసారి ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేసింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెండ్లికి ముందే శృంగారం మంచిది కాదంటూ పోస్టు పెట్టాడు. దాన్ని షేర్ చేస్తూ కంగనా ఇలా రాసుకొచ్చింది. కొందరు స్త్రీ వాదులు పెండ్లికి ముందే సెక్స్ అంటేనే పాపంగా చూస్తారని తెలిపింది.
అలాగే పెళ్లికి ముందే డేటింగ్ చేస్తున్న వారిని కూడా అంటరాని వారిగా చూస్తారా.. అది మీ సంస్కారమా అంటూ సెటైర్లు పేల్చింది. పెళ్లికి ముందే సెక్స్ చేయడం అనేది వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. యూత్ కు సెక్స్ మీద అవగాహన ఉండటం చాలా అవసరం. లేదంటే అరాచకాలు జరుగుతాయి అంటూ కామెంట్ చేసింది.
ఆమె చేసిన పోస్టు సంచలనం రేపుతోంది. పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఇలాంటి కామెంట్లు చేస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. ఇక హిందూత్వ వాదాన్ని బలంగా వినిపించే కంగనా.. ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేస్తుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఆమె కామెంట్ పై చాలామంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.