Kangana Ranaut Dated Star Hero : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే అందరికీ టక్కున కంగనా రనౌత్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆమె చేసే కామెంట్లు బాలీవుడ్ ను కుదిపేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆమె చేసే హాట్ కామెంట్లు హీరోలకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఎవరినైనా సరే తన మాటలతో ఉతికి ఆరేయడం కేవలం కంగనాకు మాత్రమే సాధ్యం.
అలాంటి కంగనా రనౌత్ కెరీర్ పరంగా మాత్రం బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. ఇక రీసెంట్ గా డ్రగ్స్ విషయంలో కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో 99 శాతం మంది సెలబ్రిటీలు డ్రగ్స్ ను వాడుతుంటారు. ఓ స్టార్ హీరో కూడా ఇలాగే డ్రగ్స్ కు బానిసయ్యాడు. దాంతో అతని భార్య అతన్ని వదిలేసింది.
ఆ తర్వాత నేను అతనితో డేటింగ్ చేశాను. అతనికి డ్రగ్స్ బాగా వాడే అలవాటు ఉంది. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు అతన్ని, నన్ను బెదరించారు. దాంతో అతనితో డేటింగ్ చేయడం మానేశాను. నాకు తెలిసినంత వరకు బాలీవుడ్ స్టార్లు అందరూ డ్రగ్స్ ను తీసుకుంటారు.
కానీ ఎవరూ ఈ విషయాలను చెప్పడానికి ధైర్యం చేయరు. కానీ నాకు ఆ భయం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. అందుకే ఇంత నిస్వార్థంగా మాట్లాడుతున్నాను అంటూ తెలిపింది కంగనా రనౌత్. ఆమె చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. కాకపోతే ఆమె డేటింగ్ చేసిన హీరో పేరును మాత్రం బయట పెట్టలేదు.
Read Also : Mrunal Thakur Is Dating Arjit Taneja : ఆ నటుడితో డేటింగ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఇలా బయట పెట్టిందిగా..!