Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటే దేశ వ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. ఆమె సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలతోనే చాలా ఫేమస్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోల మీద ఆమె ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఆ కారణంగా ఆమె స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది.
కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం చాలానే చేసింది. ఇక రెమ్యునరేషన్ విషయంలో కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు తన వాయిస్ ను వినిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ లోచాలామంది హీరోయిన్ల ఫ్రీగా సినిమాలు చేస్తారు.
ఎందుకంటే వారు ముందే నిర్మాతలతో కమిట్ మెంట్ అయిపోతారు. కావాల్సిందంతా ముందే తీసేసుకుని ఏమీ తెలియనట్టు నటిస్తారు. అందుకే వారంటే నాకు నచ్చదు. కానీ నేను అలా ఫ్రీగా చేయను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటాను. ఇప్పుడు బాలవుడ్ లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది నేను మాత్రమే.
బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు హీరోల చెప్పుచేతల్లో ఉంటారు. వారు చెప్పినట్టే వింటారు. ఎందుకంటే వారికి హీరోల తరఫున ఛాన్సులు రావాలనేది వారి ఆశ అంటూ సంచలన ఆరోపణలు చేసింది కంగనా రనౌత్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : Jr NTR : ఎన్టీఆర్ కు ఆ అమ్మాయితో సీక్రెట్ ఎఫైర్.. ప్రముఖ క్రిటిక్ సంచలన పోస్టు..!
Also Read : Niharika konidela : నన్ను చూసి ఎవరూ ఆ పని చేసుకోరు.. నిహారిక ఏంటీ మాటలు..!