Kangana Ranaut Sensational Comments On Star Hero : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె చేసే కామెంట్లు బాలీవుడ్ ను కుదిపేస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు వివాదం రాజేస్తూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ల మీదనే ప్రధానంగా ఆమె ఆరోపణలు ఉంటాయి.
ఈ క్రమంలోనే కంగనా రనౌత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సంచలనం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే కచ్చితంగా హీరోలతో సన్నిహితంగా ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు కూడా వచ్చేవి కావు.
మంచి పాత్రలు రావలంటే కచ్చితంగా స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉండాలని నాకు అర్థం అయింది. దాంతో ఓ స్టార్ హీరోతో ఓ రాత్రంతా గడిపాను. అతనితో సన్నిహితంగా ఉంటూ వచ్చాను. దాంతో ఓ సినిమాలో 2 నిముషాల పాత్రను నాకు ఇచ్చారు. అది చాలా రొమాంటిక్ పాత్ర.
ఆ విషయం తెలుసుకున్న కొందరు.. అప్పటి నుంచి నన్ను అలాగే చూశారు. కానీ అది తప్పు అని నాకు అర్థం అయింది. అందుకే నా ట్యాలెంట్ తోనే సినిమా ఛాన్సులు వచ్చేదాకా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. నా మొండి ధైర్యమే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చింది అంటూ తెలిపింది కంగనా రనౌత్. కానీ ఆ స్టార్ హీరో పేరును మాత్రం చెప్పలేదు.