Kangana Ranaut Takes Drugs : బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ కు ఎంత ఫేమ్ ఉందో.. అంతే నెగెటివిటీ ఉంది. ఎందుకంటే ఆమె చేసే కామెంట్లు బాలీవుడ్ ను కుదిపేస్తుంటాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి ఎదిగింది. బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది. కానీ ఏం లాభం.. ఆమె ఆ క్రేజ్ ను పాడు చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టార్ హీరోలపై చేసే కామెంట్లు తీవ్ర దుమారం రేపుతుంటాయి.
కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక బాలీవుడ్ లో అణచివేత, నెపోటిజాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ భామ. ఇక తాజాగా ఆమె చేసిన కామెంట్లు మరోసారి సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆమె బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం గురించి కామెంట్లు చేసింది.
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లో దాదాపు అందరూ డ్రగ్స్ తీసుకుంటారు. బడా స్టార్లు కూడా ఇదే పని చేస్తారు. నేను కూడా ఎన్నోసార్లు వారు తీసుకుంటుండగా చూశాను. అంతెందుకు నేను గురువుగా భావించే ఓ డైరెక్టర్ నాకు మొదట్లో డ్రగ్స్ అని చెప్పకుండా వాటి రుచి చూపించాడు.
తర్వాత అది డ్రగ్స్ అని తెలుసుకుని షాక్ అయ్యాను. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటున్నాను. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ తోనే నిండిపోయింది అంటూ సంచలన కామెంట్లు చేసింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కొందరు ఆమెపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.