Karate Kalyani : కాంట్రవర్సీ బ్యూటీ కరాటే కల్యాణీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇప్పటికే వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. రీసెంట్ గానే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆమెను మా అసోసియేషన్ సస్పెండ్ చేసింది. అంతకు ముందు కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.
ఇదిలా ఉండగా కరాటే కల్యాణీ గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె చాలా సినిమాల్లో నటిగా చేసింది. కానీ వరుస వివాదాలతో ఎక్కువ కాలం సినిమాల్లో నటించలేకపోయింది. అయితే ఆ సమయంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి.
అయినా సరే ఇప్పుడు మూడో పెళ్లికి నేను రెడీగా ఉన్నాను. బాయ్ ఫ్రెండ్ అయినా సరే ఓకే. ప్రేమ పేరుతో ఇప్పటికే ఇద్దరు నన్ను వాడుకుని వదిలేశారు. అందుకే ఇప్పుడు మంచి అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నా. నన్ను, పిల్లల్ని అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాను.
అందర్నీ బాగా చూసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న అంటూ ఆసక్తికర కామెంట్లు చేసింది కల్యాణీ. ఆమెకు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. విడాకులు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. చూడాలి మరి ఆమెకు మూడో పెండ్లి కుదురుతుందో లేదో అనేది.
Read Also : Nikhil Siddhartha : భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. మొత్తానికి ఒప్పుకున్నాడు..!