Karate Kalyani : ఈ నడుమ కరాటే కల్యాణి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని అడ్డుకుని ఆమె వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ నుంచి ఆమెను మంచు విష్ణు సస్పెండ్ కూడా చేశారు. దాంతో ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది.
అయితే కరాటే కల్యాణి గతంలో కూడా అనేక కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది. ఇది ఆమెకు కొత్తేం కాదు. ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం.
సినిమా ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి ఆమెను ఓ ఇంటర్వ్యూలో కల్యాణిని ప్రశ్నించింది యాంకర్. దానిపై ఆమె స్పందిస్తూ.. సినిమాల్లో అవకాశాలు రావాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ట్యాలెంట్ ఉంటే ఎలాంటి చెత్త వెధవలకు లొంగాల్సిన అవసరం లేదు.
మన ట్యాలెంట్ మనకు అవకాశాలు తీసుకువస్తుంది. అంతే గానీ ఐదు నిముషాల సుఖం కోసం కక్కుర్తి పడొద్దు అంటూ చెప్పుకొచ్చింది కరాటే కల్యాణి. ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాగా కల్యాణికి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. ఈ నడుమ ఆమె ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడమే దీనికి ప్రధాన కారణం.
Read Also : Mega Star Chiranjeevi : చిరంజీవి డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?
Read Also : SS Rajamouli : రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి పేరు తెచ్చుకున్న హీరో ఎవరో తెలుసా..?