Kasthuri Shankar : హీరోయిన్ గా కస్తూరి శంకర్ అప్పట్లో చాలా ఫేమస్. అప్పట్లో ఎన్నో ఫీల్ గుడ్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ లో అదరగొడుతోంది. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియస్ పెద్ద హిట్ అయింది.
ఇక కస్తూరి వ్యక్తిగతంగా చాలానే కాంట్రవర్సీల్లో ఉంటుంది. అప్పట్లో న్యూడ్ గా ఫొటో షూట్ చేసి సంచలనం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. తెలుగులో నేను చాలా సినిమాల్లో నటించాను.
కానీ ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఓ హీరో చేసిన పనికి షాక్ అయ్యాను. ఆయనతో నేను రెండు సినిమాల్లో నటించాను. రెండో సినిమా షూటింగ్ చెన్నైలో చేస్తున్నప్పుడు ఇద్దరికీ ఒకే హోటల్ లో రూమ్ లు ఇచ్చారు. ఓ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన రాత్రి డ్రింక్ చేసి నా రూమ్ కు వచ్చారు.
ఏమైనా మిస్ బిహేవ్ చేస్తాడేమో అని భయపడ్డాను. కానీ ఆయన కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. ఆ ఇన్సిడెంట్ నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోగా ఉన్నారు. కాకపోతే ఆయన పేరును బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు అంటూ తెలిపింది కస్తూరి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Tollywood : టాలీవుడ్ లో అత్యధిక అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న హీరో అతనే..!
Read Also : Anchor Sreemukhi : వాడి వల్ల చనిపోదామనుకున్నా.. శ్రీముఖి జీవితంలో ఇంత విషాదమా..!