ఇప్పుడు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఎవరూ దీనిపై పెద్దగా స్పందించేవారు కాదు. ఎక్కడ తమకు అవకాశాలు రాకుండా పోతాయో అనే భయం అందరిలో ఉండేది. కానీ మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై ధైర్యంగా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు నటి కస్తూరి శంకర్ కూడా దీనిపై ధైర్యంగా స్పందించింది. ఆమె గతంలో హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్ లో నటిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేసే ఆమె తాజాగా కమిట్ మెంట్ల మీద స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంది. సినీ పరిశ్రమలో డబ్బులిచ్చి పని చేయించుకునే వారు ఉన్నారు. షార్ట్ కట్ లు పనికిరావు. ఎవరికో కమిట్ మెంట్లు ఇచ్చేసి వారి పక్కలో పడుకుంటే స్టార్ డమ్ రాదు. ఇక్కడ ట్యాలెంట్ ఉండాలి. ట్యాలెంట్ తోనే పైకి వస్తాం అని గుర్తుంచుకోవాలి అంటూ తెలిపింది కస్తూరి. ప్రస్తుతం ఆమెచేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.