Keerthy Suresh Reacts On Casting Couch : సినిమా రంగం అంటనే ఇక్కడ అనవసర ఇబ్బందులు హీరోయిన్లకు కచ్చితంగా ఎదురవుతుంటాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి మాత్రమే కాదు.. బడా బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న కొందరు హీరోయిన్లకు కూడా ఇది తప్పేలా లేదు. కాగా మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరు దీనిపై మాట్లాడుతున్నారు.
ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్లు కూడా తమకు జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఓపెన్ అయిపోయింది. ఆమె ఇప్పుడు వరుస హిట్లతో జోరు మీద ఉంది. బడా ప్రాజెక్టలతో చాలా బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఇందులో ఆమెకు ఇండస్టస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ ఉందని నాకు కూడా ఎతలుసు. చాలామంది హీరోయిన్లు దీని గురించి నాకు చెప్పాను. ఇప్పటి వరకు నాకు అయితే ఆ అనుభవం ఎదురు కాలేదు. అది రాకూడదనే కోరుకుంటున్నాను.
ఒకవేళ నాకు కమిట్ మెంట్లు ఇవ్వాలనే టార్చర్ ఎదురైతే మాత్రం కచ్చితంగా సినిమా ఇండస్ట్రీని వదిలేసి జాబ్ చేసుకుంటాను అంటూ తెలిపింది కీర్తి సురేష్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.