Kotasrinivas Rao : ఈ నడుమ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మెగా ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న పవన్ కల్యాణ్ మీద దారుణమైన కామెంట్లు చేశారు. రోజుకు రెండు కోట్లు తీసుకుంటానని పవన్ బహిరంగంగా చెప్పడాన్ని తప్పు బట్టారు ఆయన. గతంలో హీరోలు ఇలా చెప్పేవారు కాదని సెటైర్ వేశారు.
ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆయన మీద భగ్గుమంటున్నారు. కొందరేమో గతంలో చిరంజీవి మీద కూడా కోట చేసిన వ్యాఖ్యలను వెతికి మరీ బయటకు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. గతేడాది కార్మిక దినోత్సవం సందర్భంగా చిరంజీవి సినీ కార్మికుల కోసం ఆస్పత్రి కట్టిస్తానని హామీ ఇచ్చారు.
దానిపై కోట అప్పట్లో సీరియస్ అయ్యారు. చిరంజీవికి చేతనైనా ఎవరికైనా సాయం చేయాలి. అంతే గానీ ఆస్పత్రి కట్టిస్తే అందులో ఎవరు చూయించుకుంటారు. డబ్బులుంటే వారే అపోలో ఆస్పత్రిలో చూయించుకుంటారు. కృష్ణా నగర్ లో చాలామంది కార్మికులు ఒక్క పూట భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం చేయాలి.
నా ఇంటికి ఇప్పటికీ ఎవరు వచ్చినా డబ్బులిస్తుంటారు. కాబట్టి చిరంజీవి ఇలాంటి కబుర్లు చెప్పకుండా ఏదైనా చేసి చూపించాలి. ఇలాంటి కామెంట్లు చేసినంత మాత్రాన నాకు చిరంజీవి మీద అభిమానం లేదని కాదు అంటూ చెప్పుకొచ్చారు కోట. ఇలా కోట చేసిన కామెంట్లపై తాజాగా మరోసారి ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.
Read Also : Supreeta : మంచి అబ్బాయిని చూడండి.. మా అమ్మకు పెళ్లి చేస్తా.. సుప్రీత పోస్టు వైరల్..!
Read Also : Prabhas : ప్రభాస్ ప్రతిసారి క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడు.. అసలు కారణం ఇదే..!