Krithi Shetty : కన్నడ యంగ్ బ్యూటీ కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిపోయింది. మొదట్లో వరుసగా హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస ప్లాపులతో సతమతం అవుతోంది. ఆమె ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లాంటి వరుస హిట్లు కొట్టింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు.
ఎందుకంటే తర్వాత వరుసగా ప్లాపులు వచ్చాయి. మూడు ప్లాపుల తర్వాత ఆమె నుంచి వస్తున్న మూవీ కస్టడీ. నాగచైతన్య హీరోగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్ లో కృతిశెట్టి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. బంగార్రాజు సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ కు ఫోన్ చేసి ఏడ్చేశాను. ఎందుకంటే బంగార్రాజు సినిమా లాగానే మా శెట్టి ఫ్యామిలీలో కూడా ఒక నమ్మకం ఉంది.
అదేంటంటే మా పూర్వీకుల ఆత్మలు మా చుట్టూ తిరుగుతాయని మేం బలంగా నమ్ముతాం. ఇదే విషయాన్ని నేను డైరెక్టర్ కృష్ణకు చెప్పాను. అచ్చం బంగర్రాజులో కూడా ఆత్మల గురించి ఉండటంతో నాకు మా ఫ్యామిలీ గుర్తుకు వచ్చి తెలియకుండానే నా కంట్లో నీళ్లు వచ్చేశాయి.
ఆ సినిమాను నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ తెలిపింది కృతి. ఆమె చేసిన కామెంట్లు కాస్త వింతగా ఉండటంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా అంటూ అడుగుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.
Read Also : Karate Kalyani : నేను పైట జారిస్తే సొల్లు కారుస్తారు.. కరాటే కల్యాణి కామెంట్లు వైరల్..!
Read Also : Senior Actress Pavala Shyamala : పవన్ కల్యాణ్ ఆఫీసుకు వెళ్తే ఆ నిర్మాత నన్ను తోసేశాడు.. పావలా శ్యామల..!