Kriti Sanon : అందరూ అనుకుంటున్నట్టు గానే కృతిసనన్ తన మనసులో మాటలను మెల్లిమెల్లిగా బయట పెడుతోంది. ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరున్న ప్రభాస్ ఇంకా పెండ్లి చేసుకోలేదు. అయితే ఆయన మీద ఇప్పటికే చాలా రూమర్లు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఉత్తవే అని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంది.
ఈ క్రమంలోనే ఆయనకు కృతిసనన్ తో ప్రేమ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై ఆ మధ్య కృతిసనన్ ఓ పోస్టు చేసింది. తనకు ప్రభాస్ తో ఎలాంటి ప్రేమ లేదని, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ తెలిపింది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ ప్రమోషన్స్ లో వీరిద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టింది. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం గురించి మీరేం అంటారు అని అడగ్గా.. అతను పెళ్లి చేసుకుంటే చూడాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్.
అతను పెళ్లి చేసుకుంటే కచ్చితంగా మంచి భర్త అవుతాడు. తనకు కాబోయే అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది అంటూ తెలిపింది కృతి. ఇంకేముంది ఇది విన్న వారంతా… ఆమె మనసులో ప్రభాస్ ను చేసుకోవాలని ఉందేమో.. అందుకే ఇలా మాట్లాడుతుందా అంటూ అడుగుతున్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సీతారాముల్లా కలిసి ఉంటారని అంటున్నారు కొందరు.
Read Also : Divyansha Kaushik : అవును.. నాగచైతన్యను ప్రేమిస్తున్నా..దివ్యాంశ కౌశిక్ సంచలన ప్రకటన..!
Read Also : Bigg Boss Sarayu : నేను వర్జిన్ కాదు.. అతనితో ఏడేళ్లు సహజీవనం చేశా.. బిగ్ బాస్ సరయు..!