Kriti Sanon Revealed His Personal Matters An Interview : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా బాగా వినిపిస్తున్న పేరు కృతిసనన్. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ భామకు ఈ నడుమ పెద్దగా కలిసి రావట్లేదు. మరీ ముఖ్యంగా ఆమె సౌత్ ఇండియాలో పాగా వేయాలనుకున్నప్పుడల్లా ఎదురు దెబ్బ తగులుతోంది. గతంలో మహేశ్ బాబు వన్ నేనొక్కడినే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కానీ బెడిసికొట్టింది.
రీసెంట్ గా ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించింది. దీంతో తనకు తిరుగుండదని భావించింది. కానీ దారుణమైన ప్లాప్ ను మూటగట్టుకుంది. దాంతో మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది ఈ భామ. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో మాట్లాడుతూ తనకు ఎదురైన బాడీ షేమింగ్ కామెంట్లను బయట పెట్టేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా మోడల్ గా చేసి సినిమాల్లోకి వచ్చాను. బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ట్రై చేస్తుండగా.. కొందరు నాకు చెత్త సలహాలు ఇచ్చారు. నీ ముక్కు బాగా లేదు. బాగా ఎర్రగా ఉంది అంటూ చెప్పారు.
నీ పెదాలు కూడా బాగా లేవు. వాటికి సర్జరీ చేయించుకో అప్పుడే నీకు హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయి అని అన్నారు. చాలా బాధగా అనిపించింది. కానీ నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నా డెడికేషన్ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్.