Langya Henipa Virus : మొన్న కరోనా.. నిన్న మంకీ పాక్స్.. ఇవాళ మరో కొత్త వైరస్ .. ఇలా ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. కరోనా నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పుడు చైనాలో మరో కొత్త వైరస్ సోకుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలోనే కొత్త వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సరికొత్త వైరస్ రకం ల్యాంగా హెనిపావైరస్ అని పరిశోధకులు తెలిపారు. లాంగ్యా హెనిపా వైరస్ కేసులు చైనాలోని హెనాన్, షాంగ్ డాంగ్ ప్రావిన్స్ ల్లో నమోదయ్యాయి. జ్వరంతో బాధపడుతున్న పేషంట్ల నుంచి సేకరించిన స్వాబ్ లో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.
ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్టుగా గుర్తించారు. దీని ద్వారా ఇప్పటికే చైనాలో 35 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. వీరికి జంతువుల నుంచే సోకి ఉంటుందని భావిస్తున్నారు.
Langya Henipa Virus Shaking Countries of World
లాంగ్యా హెనిపా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, వికారం వంటి లక్షణాలను గుర్తించారు. దీంతో పాటు ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. 40 నుంచి 75 శాతం వరకు మరణాలు ఉండొచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను గ్లోబల్ టైమ్స్ పత్రిక ఉటంకించింది.
Read Also : Raju Srivastava : ప్రముఖ స్టాండప్ కమెడియన్ కు గుండెపోటు
Read Also : Sunil Bansal : తెలంగాణ ఇంచార్జీగా సునీల్ బన్సల్ ను నియమించిన బీజేపీ అధిష్టానం