Lavanya Tripathi : ఇప్పుడు ఎక్కడ చూసిన లావణ్య త్రిపాఠి పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు మెగా కోడలు కాబోతోంది. నిన్న వరుణ్ తేజ్ తో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఈ భామ. ఐదేండ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఎట్టకేలకు ఇంట్లో వారిని ఒప్పించి ఒక్కటి కాబోతోంది. నిన్న వరుణ్ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే వచ్చారు.
ఇన్ని రోజులు తమ మధ్య ఏమీ లేదని దాటవేస్తూ వచ్చిన ఈ జంట.. సడెన్ గా ఎంగేజ్ మెంట్ తో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అసలు లావణ్య త్రిపాఠి ఎవరు, ఆమె ఆస్తులు ఎంత అనే కోణంలో ఆరా తీస్తున్నారు చాలామంది. లావణ్యది డెహ్రాడూన్. ఆమె తండ్రి హైకోర్టు లాయర్ గా పని చేస్తున్నారు. తల్లి స్కూల్ టీచర్ గా ఉంది.
ఆమెకు ఓచెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అయితే లావణ్య సినిమాల ద్వారా బాగానే సంపాదించింది. చేసిన వాటిలో తక్కువ హిట్లు పడ్డాయి. అందుకే స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ వరుసగా సినిమాలు చేసి బాగానే సంపాదించింది. ఆమె ఆస్తులు మొత్తం కలిపి రూ.20 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది.
ఇందులో చాలా వరకు లావణ్య సినిమాల ద్వారానే సంపాదించిందంట. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మానేస్తుందని అంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ కోడలు అంటే సినిమాల్లో నటించడం కష్టమే. కాబట్టి ఆ ఇంటి గౌరవం కోసం ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పుబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Actress Madhavi Latha : స్టార్ హీరోలు మిగతా వారిని తొక్కేస్తున్నారు.. మాధవీ లత సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Sri Reddy : ఇష్టంతో పడుకుంటే తప్పేంటి.. మాట మార్చిన శ్రీరెడ్డి..!