Madhavi Latha Accusing Tollywood Of Casting Couch : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది గొంతు విప్పుతున్నారు. మీటూ ఉద్యమం తర్వాత ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అలా అని కాస్టింగ్ కౌచ్ ఆగిందా అంటే అదీ లేదు. ఇది కామన్ గానే జరిగిపోతోంది. కానీ ఆరోపణలు చేయడం మాత్రం ఆపట్లేదు చాలామంది ముద్దుగుమ్మలు.
ఇక తెలుగులో కాస్టింగ్ కౌచ్ మీద ఎప్పికప్పుడు స్పందించే మాధవీలత మరోసారి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఆమె గతంలో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె టాలీవుడ్ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూనే ఉంది.
ప్రస్తుతం మరోసారి అలాంటి కామెంంట్లే చేసింది ఈ భామ. ఆమె మాట్లాడుతూ.. నేను ఇప్పటికే టాలీవుడ్ లోచాలా ఇబ్బందులు పడ్డాను. ఓ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నప్పుడు చాలా టార్చర్ చేశాడు. ఓ సీన్ చేసేటప్పుడు కావాలనే నా టాప్ విప్పేసి బ్రాలో ఎక్స్ పోజింగ్ చేయాలంటూ ఆర్డర్ వేశాడు.
అందరి ముందు ఎలాం చేస్తాం అని చెప్పినా సరే వినిపించుకోలేదు. చివరకు ఆ మూవీ హీరో వద్దకు వెళ్లి విషయం చెప్పాను. ఆయన వచ్చి డైరెక్టర్ తో మాట్లాడి ఆ సీన్ ను తీయించేశాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నాకు డైరెక్టర్ నుంచి టార్చర్ తప్పలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవీలత.