Madhavi Latha : తెలుగు హీరోయిన్ మాధవీ లత ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు జరిగిన అనుభవాలు, అవమానాల గురించి చెప్పుకుంటూనే వస్తోంది. తెలుగు ఇండస్ట్రీపై ఆమె చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో మాధవీ లత మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు. ఎందుకంటే ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అడిగే వారే చాలా ఎక్కువ. దర్శకులు, నిర్మాతల కామ కోరికలు తీరిస్తేనే ఇక్కడ అవకాశాలు ఇస్తారు. మేం దానికి ఒప్పుకోం. కానీ ముంబై హీరోయిన్లు మాత్రం వాటికి ఎప్పుడూ ఓకే చెబుతూ ఉంటారు.
అందుకే వారికి ఇక్కడ ఛాన్సులు ఇస్తారు. నన్ను కూడా చాలా మంది అప్పట్లో ఇబ్బందులు పెట్టారు. ఓ డైరెక్టర్ అయితే ఛాన్స్ ఇస్తా నా రూమ్ కు వస్తావా అంటూ దారుణంగా అడిగారు. కొడుతామనేంత కోపం వచ్చింది కానీ ఆయన చాలా పెద్దాయన. అందుకే అక్కడి నుంచి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం నాకు ఛాన్సులు పెద్దగా రావట్లేదు. ఇండస్ట్రీలో కమిట్ మెంట్లు లేకపోతే తెలుగు అమ్మాయిలు ఎక్కడో ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అందుకే మాకు అవకాశాలు రావట్లేదు అంటూ చెప్పుకొని బాధ పడింది మాధవీ లత. ఆమె చేసిన కామెంట్ల సంచలనం రేపుతున్నాయి.
Read Also : Heroines : పెళ్లి కాకుండానే తల్లి అయిన హీరోయిన్లు.. ఎవరంటే..?
Read Also : Shruti Haasan : స్నానం చేసేటప్పుడే ఆ పని చేస్తా.. శృతిహాసన్ చెండాలమైన ఆన్సర్..!