Madhavi Latha : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఎప్పటి నుంచో అవకాశాలు రావట్లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా ఊపేశారు. కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు మాత్రం ఎలాంటి అవకాశాలు రావట్లేదు. దాంతో తెలుగు అమ్మాయిలు చాలా సీరియస్ గా ఆరోపణలుచేస్తూ వస్తున్నారు.
ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరోయిన్ మాధవీ లత గురించి. నచ్చావులే సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె అవకాశాలు పట్టేసింది. కానీ హిట్లు పడలేదు. దాంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. పట్టుమని పదేండ్లు కూడా ఇండస్ట్రీలో లేకుండా పోయింది.
అయితే అప్పటి నుంచి ఆమె హీరోలపై ఎప్పటికప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇక బిగ్ బాస్ ను ఆమె చాలాసార్లు టార్గెట్ చేసింది. గతంలో బిగ్ బాస్ సీజన్ ను ఉద్దేశించి ఆమె ఏకంగా నాగార్జుననే టార్గెట్ చేసింది. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు నాగ్ మామ అంటూ పోస్టు చేసింది.
అప్పట్లో ఈ కామెంట్లు హాట్ టాపిక్ అయిపోయాయి. మాధవీలతకు చాలా మంది సపోర్టు చేశారు. మాకు ఛాన్సులు ఎందుకు ఇవ్వరు అని అడిగితే తమిళంలో వెతుక్కోవాలంటూ నాగార్జున ఓ సారి అన్నారంట. అందుకే ఆమె బిగ్ బాస్ సమయంలో ఇలాంటి కామెంట్లు చేసిందని అంటున్నారు.
Read Also : Rashmika Mandanna : రష్మిక ఇన్ స్టా ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా.. ఒక్క పోస్టుకు అన్ని కోట్లా..?
Read Also : Kangana Ranaut : ఆ హీరోయిన్లు నిర్మాతలకు కమిట్ మెంట్లు ఇస్తారు.. కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు..!