Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు. ఆయన అందం అలాంటిది మరి. ఆయనతో ఒక్క సినిమాలో అయినా సరే నటించాలని చాలామంది హీరోయిన్లు కలలు కంటారు. మహేశ్ బాబు లాగా అందంగా ఉన్న వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని కోరుకుంటారు.
అంత మంది అమ్మాయిలు మహేశ్ బాబు వెంట పడితే.. ఆయన మనసు దోచుకున్న హీరోయిన్ మాత్రం వేరే ఉన్నారు. మహేశ్ బాబుతో ఇప్పటి వరకు చాలామంది హీరోయిన్లు నటించారు. కాగా ఆయన ఎక్కువగా హీరోయిన్లను రిపీట్ చేయరు. కానీ ఓ హీరోయిన్ కు మాత్రం వరుసగా మూడు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు.
ఆమె ఎవరో కాదు సమంత. దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు మహేశ్ బాబు. కాగా ఆమెకు ఎందుకు మీరు అన్ని సార్లు ఛాన్స్ ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబును అడగ్గా.. ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
సమంత చాలా ట్యాలెంటెడ్ పర్సన్. ఇంకా చెప్పాలంటే ఆమె అమ్మాయిల్లో చాలా అందంగా ఉంటుంది. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె చాలా అందంగా ఉంటుంది ఈ కారణాలు ఆమెకు అవకాశాలు వచ్చేలా చేశాయి అంటూ చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Read Also : Hero Siddharth : హీరో సిద్దార్థ్ ఇప్పటి వరకు ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపాడో తెలుసా..?
Read Also : Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ ఎంట్రీ.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!