Malavika Nair : ఈ నడుమ హీరోయిన్లు చేస్తున్న కామెంట్లు ఎంత బోల్డ్ గా ఉంటున్నాయంటే.. వినే వారికి కూడా ఆశ్చర్యం వేసే అంతగా. ఒకప్పుడు ఇంత దారుణంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం బోల్డ్ గా ఉంటేనే ఫాలోవర్లు పెరుగుతారనేంతగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ మాళవిక నాయర్ కూడా ఇలాగే రెచ్చిపోయింది.
ఆమె ఎక్కువగా పద్ధతిగా ఉండే సినిమాలే చేస్తుంది. పైగా ఆ సినిమాల్లో ఆమె చేసే పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అలాంటి ఆమె ఇప్పుడు ఏకంగా పచ్చి బూతు మాటలు మాట్లాడింది. ఏకంగా డైరెక్టర్ ను ఉంచుకుంటానంటూ చెప్పి సంచలనం రేపింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదండోయ్.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్.
అనుదీప్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా మాళవిక అనుదీప్ తో కలిసి ఓ ఫన్నీ వీడియో చేసింది. ఇందులో ఏకంగా ఆయన్ను ఉంచుకుంటానంటూ చెప్పింది. ఆమె అన్న మాటలకు అనుదీప్ సిగ్గుతో ముఖం మూసుకోవడం ఇంకా హైలెట్.
అయితే ఇదంతా ఆమె సినిమా ప్రమోషన్ కోసమే చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్, మాళవిక కాంబోలో వస్తున్న మూవీ అన్నీ మంచి శకునములే. ఈ నెల 18న ఇది విడుదల కాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె ఇలా నటించింది.
Read Also : Natural Star Nani : అంజనా కంటే ముందే నాని ఆ హీరోయిన్ ను ప్రేమించాడని తెలుసా..?
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?