Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ ఇప్పుడు చాలా ప్లాపుల్లో ఉంది. ఆ ఫ్యామిలీ ఒకప్పుడు మంచి పొజీషన్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ కుటుంబం మీద నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. దాంతో హీరోలుగా కూడా రాణించలేకపోతున్నారు వారు. మోహన్ బాబు సక్సెస్ అయినంతగా ఆయన పిల్లలు మాత్రం కాలేకపోతున్నారు.
ఆయన ముగ్గురు పిల్లలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మంచు లక్ష్మీ కేవలం హీరోయిన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా చేస్తోంది. ఇప్పటికే ఆమె చాలా టాక్ షోలకు హోస్ట్ గా అదరగొట్టేసింది. కాగా ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అనుష్కశెట్టి మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవి మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. టాక్ షోలు చేయమని చాలామంది అడుగుతున్నారు. కానీ పిలిచిన వారినే ప్రతిసారి పిలవాలంటే చాలా బోరింగ్ గా ఉంటుంది కదా. ఓ సారి ఇలాగే అనుష్కను రమ్మని పిలిచాం. ఆమె వస్తానని చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.
దాదాపు రూ.3 కోట్ల దాకా ఖర్చు వచ్చింది. కానీ సడెన్ గా ఆమెకు భాగమతి షూటింగ్ రావడంతో ఆమె షోకు రాలేనని చెప్పింది. దాంతో మూడు కోట్లు నష్టపోయాం. అందుకే టాక్ షోలకు నేను హోస్ట్ గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ.
Read Also : Krithi Shetty : నా చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయి.. కృతిశెట్టి ఆశ్చర్యకర మాటలు..!
Read Also : Mega Star Chiranjeevi : ఆ విషయంలో పవన్ నాకు నచ్చడు.. చిరంజీవి సీరియస్ కామెంట్లు..!