Many Heroes Waiting Do Film With SS Rajamouli : రాజమౌళితో సినిమా చేయాలని ఎవరైనా ఆశ పడుతారు. ఆయనతో సినిమా చేస్తే అమాంతం మార్కెట్, స్టార్ డమ్ పెరుగుతుందని అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళితో సినిమా చేసేందుకు చాలామంది క్యూ కడుతుంటారు. కానీ రాజమౌళి మాత్రం తాను కమిట్ మెంట్ ఇచ్చిన వారితోనే సినిమాలు చేస్తుంటాడు.
ఇలా ఆయన ముక్కు సూటిగా వెళ్లడం వల్ల కొన్ని సార్లు రాజమౌళిపై కొందరు కోపాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఓ స్టార్ హీరో కూడా ఇలాగే రాజమౌళిపై కోపం పెంచుకున్నారంట. ఆయన ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. యమదొంగ సినిమాలో యముడి పాత్రలో నటించాడు మోహన్ బాబు. ఆ సమయంలోనే తన కొడుకు విష్ణుతో సినిమా చేయమని అడిగాడంట మోహన్ బాబు.
రాజమౌళి కూడా సరే చేస్తా అని చెప్పాడు. కానీ మోహన్ బాబు మీ తర్వత సినిమాలో పెట్టుకోండి అంటూ ఒత్తిడి చేశాడు. నేను ఆల్రెడీ వేరే హీరోకు కమిట్ మెంట్ ఇచ్చాను. ఇప్పట్లో మీ కొడుకుతో సినిమా చేయలేను అంటూ తేల్చి చెప్పాడంట. దాంతో మోహన్ బాబు అప్పటి నుంచే రాజమౌళిపై కోపం పెంచుకున్నాడని తెలుస్తోంది.
Many Heroes Waiting Do Film With SS Rajamouli
ఇక మోహన్ బాబు కొడుకుతో కాకుండా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో మగధీర సినిమా చేశాడు రాజమౌళి. యమదొంగ సినిమా తర్వాత వచ్చిన ఈ మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దెబ్బకు రామ్ చరణ్ స్టార్ హీరో అయిపోయాడు. కానీ రాజమౌళి వల్లే తన కొడుకు స్టార్ కాలేకపోయాడనే బాధ ఇప్పటికీ మోహన్ బాబులో ఉందని అంటుంటారు సినీ పెద్దలు.