Megha Akash In Love : హీరోయిన్ మేఘా ఆకాశ్ కు స్టార్ హీరోయిన్లను మించిన అందాలు ఉన్నాయి. కానీ ఏం లాభం.. ఆమెకు మాత్రం స్టార్ స్టేటస్ రావట్లేదు. నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.
డియర్ మేఘా, రావణాసుర, రాజ రాజ చోర లాంటి సినిమాల్లో నటించింది. వాటితో పాటు కన్నడ సినిమాల్లో కూడా మేఘా ఆకాశ్ కు అవకాశాలు వచ్చాయి. కానీ హిట్లు మాత్రం రావట్లేదు. ప్రస్తుతం ఆమెచేతిలో పెద్దగా అవకాశాలు లేవు. దాంతో ఆమె ఇంటివద్దనే ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను నాలుగో తరగతిలోనే లవ్ లో పడ్డాను. నా బెంచ్ లో పక్కనే కూర్చున్న అబ్బాయితో లవ్ లో పడ్డాను. అప్పుడు నాకు పెద్దగా మెచ్యూరిటీ లేదు. నేను కాలేజీ పూర్తయిన తర్వాత మొదిసారి ప్రేమలో పడింది మాత్రం షారుఖ్ ఖాన్ తోనే. ఆయన అంటే చాలా ఇష్టం.
Megha Akash Shah Rukh Khan Fell Love
ఆయన నాకు క్రష్. ఆయనతో ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను అంటూ తెలిపింది మేఘా. తనకు లవ్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉందని.. కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ తెలిపింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ నాలుగో క్లాస్ లో ప్రేమ ఏంటని అంతా షాక్ అవుతున్నారు.