Naga Babu : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్లకు మంచి డిమాండ్ ఉండేది. సినిమాలు కొన్ని సార్లు కమెడియన్ల వల్లే హిట్ అయ్యేవి. కమెడియన్లను దృష్టిలో పెట్టుకుని సీన్లు రాసుకునే వారు. అలా లెజెండరీ కమెడియన్లుగా నిరూపించుకున్న వారిలో రేలంగి తర్వాత బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ నిలిచారు.
ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ ఒక తాబుగోతుగా బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన అలా తాగుబోతు కావడానికి కారణం మెగా బ్రదర్ నాగబాబు. ఆయన హీరోగా వచ్చిన రుక్మిణి అనే సినిమాలో నాగబాబు అసిస్టెంట్ గా మొదటిసారి తాగుబోతుగా కనిపించారు ఎమ్మెస్ నారాయణ. అయితే మొదట తాను తాగుబోతు క్యారెక్టర్ కు సెట్ కానని వద్దన్నారంట.
కానీ నాగబాబు మాత్రం పట్టుబట్టి మీరు తాగుబోతు పాత్రకు బాగా సెట్ అవుతారు. నా మాట విని చేయండి అంటూ బలవంతంగా చేయించారంట. ఆయన చెప్పినట్టుగానే ఎమ్మెస్ తాగుబోతుగా బాగా నటించి మెప్పించారు.
MS Narayana Became Very Famous Drunkard
దాంతో అప్పటి నుంచి ఆయనకు ఎక్కువగా తాగుబోతు పాత్రలు బాగా వచ్చాయి. కానీ కొందరు మాత్రం నాగబాబు వల్లే ఆయన తాగుబోతుగా మారారంటూ అప్పట్లో వార్తలు రాశారు. కానీ ఒక రకంగా నాగబాబు వల్లే ఎమ్మెస్ కు అంత పేరు వచ్చింది.
Read Also : Deepika Padukone : మగాళ్లకు అంత స్టామినా లేదు.. పచ్చిగా మాట్లాడిన దీపికా పదుకొణె..!
Read Also : SS Rajamouli : ఆ హీరోతో చచ్చినా సినిమా చేయను.. తెగేసి చెప్పేస్తున్న రాజమౌళి..!