Naga Babu : అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడంటే మెగా బ్రదర్ నాగబాబు చాలా మంచి పొజీషన్ లో ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఆయన చాలా అప్పుల్లో కూరుకుపోయారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మొదట్లో హీరోగా చేసినా వర్కౌట్ కాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు.
చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లతో కొన్ని సినిమాలను నిర్మించారు నాగబాబు. అయితే ఆరెంజ్ సినిమా తీసిన సమయంలో ఆయన చాలా అప్పుల్లో కూరుకుపోయారు. ఆ మూవీ ప్లాప్ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. కొన్ని రోజులు ఆ అప్పులు భరించలేక ఆయన చనిపోదామని అనుకున్నారంట.
ఆ సమయంలో చిరు, పవన్ కొంత ఆదుకున్నా.. అప్పులు మాత్రం తీరలేదు. దాంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయనకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జబర్దస్త్ షోకు జడ్జిగా చేసే ఛాన్స్ ఇవ్వడంతో.. ఆ షో కారణంగానే నాగబాబు తన అప్పులు మెల్లిమెల్లిగా తీర్చుకున్నారు.
ఇదే విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు నాగబాబు. అంతే కాదు.. జబర్దస్త్ వల్లే తన కొడుకును హీరోగా చేయగలిగానంటూ తెలిపారు. అలాంటి జబర్దస్త్ నుంచి ఆయన తప్పుకోవడం మాత్రం నిజంగా ఎవరికీ నచ్చలేదు.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు వల్లే పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా..?
Read Also : Charmi Kaur : వామ్మో.. 14 ఏండ్లకే అలాంటి పని చేసిన చార్మీ.. మామూల్ది కాదుగా..!