Naga Shaurya Responded On Love Affairs : సాధారణంగా సినీ హీరోలు, హీరోయిన్ల మీద ఎఫైర్ వార్తలు, ప్రేమ, డేటింగ్ వార్తలు చాలా కామన్. కానీ వాటిని కొందరు మాత్రమే సీరియస్ గా తీసుకుని స్పందిస్తారు. మరికొందరు మాత్రం వాటిని అస్సలు లెక్క చేయరు. కనీసం పట్టించుకోరు కూడా. అయితే నాగశౌర్య మాత్రం ఈ విషయంపై కాస్త భిన్నంగా స్పందించాడు.
ఆయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాగా రీసెంట్ గానే రంగబలి సినిమాతో యావరేజ్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెంట్ గా చేశారు. అప్పటి నుంచే ఆయన పేరు బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై స్పందించాడు.
నాకు పెళ్లి కాకముందు ఇలాంటివి చాలా వచ్చాయి. అందులో చూసుకుంటు.. నిహారిక, మాళవిక, రాశిఖన్నా.. ఇలా నేను ఎవరితో సినిమా చేస్తే వారితో ప్రేమలో ఉన్నట్టు లేదంటే డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు రాసేసేశారు. కానీ వాస్తవంగా నేను ఏ హీరోయిన్ గా కూడా డేటింగ్ చేయలేదు.
నిజానికి నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. కానీ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు ఎందుకు రాయరో తెలియట్లేదు. ప్లీజ్ అలా రాయండి అని నేను గతంలో సరదాగా చెప్పేవాడిని అంటూ గుర్తు చేసుకున్నాడు నాగశౌర్య. ఇక తన అప్ కమింగ్ సినిమాల గురించి త్వరలోనే అప్ డేట్లు ఇస్తానని చెప్పాడు.
Also Read : Priyanka Chopra Dated A Friend : 18 ఏళ్లకే డేటింగ్ చేసి మోసపోయా.. ప్రియాంక చొప్రా కామెంట్లు వైరల్..!