Nandamuri Balakrishna Commented On Exposure Of Heroines : ఇప్పుడు సినిమా రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్ అయిపోయింది. ఇక్కడ అందాలు ఆరబోస్తేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ట్యాలెంట్ ఎంత ఉన్నా సరే.. అందాలను మాత్రం ఓ రేంజ్ లో విప్పి చూపించాల్సిందే. లేకపోతే ఇక్కడ ఛాన్సులు రావు. అందుకే హీరోయిన్లు అందరూ ఇదే బాట పడుతున్నారు.
కాగా కొందరు హీరోయిన్లు ఈ ఎక్స్ పోజింగ్ ను ఎంకరేజ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎక్స్ పోజింగ్ మీద గతంలో బాలయ్య చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆయన అన్ స్టాపబుల్ షో చేసినప్పుడు రాశిఖన్నా, జయప్రద, జయసుధ వచ్చారు.
ఈ సందర్భంగా వారికి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేశాడు. నువ్వు నటించిన హీరోలలో ఎవరి మీద అయినా క్రష్ ఉందా అని రాశిఖన్నాను అడిగాడు. దానికి క్షణం కూడా ఆలోచించకుండా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఇక గ్లామర్ ఎక్స్ పోజింగ్ గురించి బాలయ్య ప్రశ్న వేయగా.. వారు ముగ్గురూ తడబడ్డారు.
దాంతో బాలయ్య కల్పించుకుంటూ.. నటిగా ఎదగాలంటే కథకు ఏది అవసరం అయినా సరే డైరెక్టర్లు చెబితే చేయాలి. అప్పుడే పరిశ్రమలో పది కాలాల పాటు నిలబడగలుగుతారు. అది హీరో అయినా హీరోయిన్ అయినా సరే కథకు ఏది బలం అయితే అదే చేయాలి అంటూ ఆయన చెప్పారు. అంటే ఎక్స్ పోజింగ్ ను ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆయన కామెంట్లు ఉన్నాయన్న మాట.