Karate Kalyani : కరాటే కల్యాణీ ఈ నడుమ నిత్యం కాంట్రవర్సీలతో కాలం గడుపుతోంది. గతంలో సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసిన ఆమె.. ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాక ఇంటివద్దనే ఉంటుంది. అందుకే నిత్యం బీజేపీ, హిందూ సంఘాలతో కలిసి హిందూ దేవుళ్ల గురించి ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది.
రీసెంట్ గానే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూశాం. ఖమ్మంలో ఏర్పాటు చేసే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని కరాటే కల్యాణీ అడ్డుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమెను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
గత ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చాలామంది నన్ను నెగెటివ్ గా చూస్తారు. ఎందుకంటే నేను సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ పాత్రలే చేశాను. కానీ నాకు ఆ పాత్రలంటేనే ఇష్టం. ఎందుకంటే ఈ రోజు అందరూ నన్ను గుర్తు పడుతున్నారంటే దానికి కారణం ఆ పాత్రలే ఆ పాత్రల్లో నేను పైట జారిస్తే సొల్లు కారుస్తారు.
కానీ మళ్లీ వారే నన్ను తిట్టుకుంటారు. అందుకే నేను ఎవరేం అన్నా సరే పెద్దగా పట్టించుకోను. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే సినిమాలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు రెండు పెళ్లిలు అయి విడాకులు కూడా అయ్యాయి. మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కల్యాణీ. మరి ఆమె కోరుకున్నట్టు మూడో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.
Read Also : Bigg Boss Sarayu : నేను వర్జిన్ కాదు.. అతనితో ఏడేళ్లు సహజీవనం చేశా.. బిగ్ బాస్ సరయు..!
Read Also : Kriti Sanon : ప్రభాస్ చాలా మంచి భర్త అవుతాడు.. కృతిసనన్ మనసులో మాట..!