Netizens Trolled Alia Bhatt On Body Shaming : ఆలియాభట్ అంటే ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. నటనలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ భామ. అలాంటి ఆమె ఎన్నో సినిమాలతో తానేంటూ నిరూపించుకుంది. ఎంత బడా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా సరే తన ట్యాలెంట్ తోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంది. కానీ బాలీవుడ్ లో హీరోయిన్లు అంటే ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి.
అక్కడ ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే.. కత్తిలాంటి ఫిగర్ ఉండాల్సిందే. అద్దినట్టు బాడీ సైజులు ఉండాలి. లేదంటే డైరెక్ట్ గానే ముఖం మీదే చెప్పేస్తారు దర్శకులు. ఇలా దర్శకుల చేతిలో బాడీ షేమింగ్ కామెంట్లు ఫేస్ చేశామంటూ చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి చెప్పారు. అయితే తాజాగా ఆలియాభట్ కూడా ఓపెన్ అయింది.
ప్రస్తుతం ఆమె రణ్ వీర్ సింగ్ తో కలిసి ఓసినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె మీడియాతో చిట్ చాట్ చేసింది. ఇందులో బాడీ షేమింగ్ గురించి ప్రశ్న ఎదురవగా ఆమె స్పందించింది. నేను కూడా గతంలో బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కున్నాను. నా ఎద సైజులు పెద్దగా లేవంటూ అవమానించారు.
ఆ కామెంట్లు చాలా బాధ కలిగించాయి. సినిమాలో కనిపించాలంటే కొన్ని కండీషన్లు పెట్టుకోవాలా అని బాధపడ్డాను. కానీ ఈ రోజు నేను ఈస్థాయిలో నిలబడ్డానంటే అది నా కాన్ఫిడెన్స్ తో మాత్రమే. అందుకే అలాంటి కామెంట్లు విని ఆగిపోకూడదు. మనం ఏంటో మకు తెలిస్తే చాలు అంటూ తెలిపింది ఆలియా భట్.
Read Also : Isha Koppikar on Casting Coutch : ఆ హీరో రాత్రి రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ సెన్సేషనల్..!