Real Me Smart Phone : ఎప్పుడు టెక్నాలజీ పెరుగుతూనే ఉంది.. కొత్త కొత్త బ్రాండ్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి న్యూ స్మార్ట్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఒక బ్రాండ్ కొన్న మరుసటి రోజే మరో బ్రాండ్ న్యూ మోడల్ అందుబాటులోకి వస్తుంది.. దీంతో అసలు ఏ ఫోన్ వాడాలో అర్ధం కావడం లేదు.. ప్రతీ రోజు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి రావడంతో వాటిలో ఏది తీసుకోవాలో అర్ధం కాక కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
షావోమి, వివో, ఐకు, ఒప్పో వంటి ఫోన్స్ అదిరిపోయే ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నారు.. ప్రెజెంట్ మార్కెట్ లో లభిస్తున్న ఫోన్ లలో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి ఉన్నాయి.. అలాగే 210 వాట్ ఛార్జింగ్ ఫోన్లు మార్కెట్ లోకి రాబోతున్నాయి.. అయితే రియల్ మీ ఇప్పుడు వీటిని మించిన ఆఫర్స్ తో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి రాబోతుంది.
రియల్ మీ కంపెనీ 240 వాట్ ఛార్జింగ్ ఫీచర్ తో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జిటి నియో5లో ఈ 240 వాట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండే అవకాశం ఉంది.. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అయ్యింది.
లీక్ అయిన ఫోటో ప్రకారం చుస్తే.. ఛార్జర్ మోడల్ నెంబర్ వీసీకేసీజేఏసీహెచ్.. ఛార్జర్ పై బ్రాండింగ్ పేరు సూపర్ వుక్ అని ఉంది.. 20ఏ పవర్, 12ఏ చేస్తుంది. ఒప్పో కంపెనీ ఈ ఛార్జింగ్ టెక్నాలజీని ఎండబ్ల్యూసీ 2022లో ప్రదర్శించింది.. ఈ ఫోన్ 9కేవలం నిముషాల్లోపు లోనే చార్జింగ్ ఫుల్ అవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల వేడెక్కే అవకాశం ఉంది.. అందుకే ఈ ఫోన్ లో ఐదు లేయర్స్ సెక్యూరిటీని ఉపయోగించారట.. రియల్ మి జీటీనియో 5 ఫోన్ లో ఈ ఫీచర్ ఉండవచ్చు..
Read Also : Health Tips : ముందు ముందు గుండెపోటు మరణాలు ఉండవట.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
Read Also : Ravali : పెండ్లి సందడి హీరోయిన్ రవళిని గుర్తుపట్టారా.. ఇలా మారిపోయిందేంటి..?