Nidhhi Agerwal : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఇప్పుడు సౌత్ లో చాలా బిజీ అవుతోంది. ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. బాలీవుడ్ నుంచి సౌత్ బాట పట్టిన ఈ భామకు ఇక్కడ మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో మొదలైన ఆమె ప్రయాణం బాగానే సాగుతోంది. గతంలో ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇక తాజాగా తెలుగులో పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు తెలుగులో, తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఆమె కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చింది. మరి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు కదా..
ఆ విషయంపై తాజాగా నిధి అగర్వాల్ స్పందించింది. నేను కూడా కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. మొదట్లో నేను ఓ చిన్న సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం ఆడిషన్స్ కు వెళ్లాను ఆ సినిమాకు పెద్ద నిర్మాత పని చేస్తున్నారు.
అయితే నిర్మాత మేనేజర్ నా వద్దకు వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే అడ్జస్ల్ అవ్వాల్సి ఉంటుంది. నిర్మాత, డైరెక్టర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వారి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. దాంతో నాకు విషయం అర్థం అయి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పటికీ సదరు నిర్మాత బాలీవుడ్ లో పెద్ద స్థాయిలో ఉన్నాడు.
Read Also : Mega Star Chiranjeevi : ఒక సీనియర్ ఎన్టీఆర్.. ఒక చిరంజీవి.. ఇప్పుడు ఎవరు..?
Read Also : Rakul Preet Singh : ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకుంటున్న స్టార్ హీరోయిన్.. ఛాన్సుల కోసం..!