Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఈ నడుమ చేస్తున్న కామెంట్లు వరుసగా వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె భర్త నుంచి దూరంగా ఉంటున్నప్పటి నుంచే ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టా నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది.
ఇక ఆమె భర్తతో విడిపోయిందని కొందరు అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది ఈ భామ. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మేనత్త కొడుకు వైష్ణవ్ తేజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఆమె వైష్ణవ్ తో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
గతంలో ఫ్యామిలీ ఫంక్షన్లలో ఇది స్పష్టంగా కనిపించింది. తాజాగా వైష్ణవ్ తేజ్ గురించి నిహారిక మాట్లాడుతూ.. వాడు నా కంటే ఏడాది చిన్నవాడు కానీ ఎందుకో వాడితో నాకు మంచి రిలేషన్ ఉంది. ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. వాడు కనిపించినప్పుడల్లా వాడి వీపుపై ఎక్కాలని అనిపిస్తుంది.
వాడు కనిపించినప్పుడల్లా నేను అదే పని చేస్తా. నేను సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని అనుకున్న విషయం కూడా ముందుగా వాడికే చెప్పాను. వాడు నాకు చాలా సపోర్టుగా ఉంటాడు అంటూ తెలిపింది నిహారిక. అయితే ఆమె కామెంట్లపై కొందరు నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావ్ కాబట్టే అవి చూడలేక నీ భర్త నీకు విడాకులు ఇస్తున్నాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Ram Charan And Upasana Konidela : మెగా వారసురాలి రాక.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..!
Read Also : Tamannaah Bhatia : పూర్తిగా బట్టలు విప్పలేదు.. బెడ్ రూమ్ సీన్లపై తమన్నా కామెంట్లు..!