Nikhil Siddhartha : సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. వారి వ్యక్తిగత విషయాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి వాటిలో హీరో నిఖిల్ కూడా వైరల్ అయ్యాడు. ఆయన హీరోగా మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. రీసెంట్ గానే రెండు సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు.
కానీ వ్యక్తిగతంగా ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఓ డాక్టర్ ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి అయిన కొద్ది కాలానికే ఇద్దరి నడుమ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. చాలాకాలంగా ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. రీసెంట్ గా హీరో శర్వానంద్ రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు నిఖిల్ తన భార్యతో కలిసి వచ్చాడు. ఆమెతో చాలా హ్యాపీగా కనిపించాడు. దాంతో వీరిద్దరి విడాకుల వార్తలకు చెక్ పడింది. వీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారని అందరికీ తెలిసిపోయింది.
దాంతో నిఖిల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం నిఖిల్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుస షూటింగులతో బిజీగా ఉంటున్నాడు నిఖిల్. కాగా నిఖిల్ త్వరలోనే కార్తికేయ-3 సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Sri Reddy : ఇష్టంతో పడుకుంటే తప్పేంటి.. మాట మార్చిన శ్రీరెడ్డి..!
Read Also : Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఆస్తులు ఎంతో తెలుసా.. బాగానే వెనకేసిందిగా..!