Nithin Emotional An Interview : నితిన్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొత్త కంటెంట్ ఉన్న సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఇప్పుడంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు గానీ.. ఒకప్పుడు ఆయన చేసే లవ్ స్టోరీ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. అప్పట్లో ఆయన సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అయిపోయేది.
అలాంటి నితిన్ అప్పట్లో ఓ సారి డైరెక్టర్ చేతిలో చెంప దెబ్బ తిన్నాడంట. ఈ విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను నా మొదటి సినిమా జయం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సినిమాకు తేజ గారు దర్శకుడు. ఆయనకు ముక్కు మీదనే కోపం ఉండేది.
సినిమా చివరి దశకు వస్తున్న సమయంలో ఓ ఓజు లైట్ బాయ్ రాలేదు. దాంతో తేజ కోపంతో ఊగిపోయాడు. ఆ రోజు నేను రిహార్సల్స్ చేస్తున్నా. కొన్ని సీన్లకు నా ఎక్స్ ప్రెషన్లు సరిగ్గా రావట్లేదు. ఎన్ని టేకులు చేసినా సరిగ్గా రాకపోవడంతో తేజ ఆ లైట్ బాయ్ కోపం నా మీద చూపించాడు. నా చెంప పగలగొట్టాడు.
Nithin Made Shocking Comments On Director Teja
దాంతో చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్లిపోయాను. ఆ తర్వాత తేజ మనసు తెలుసుకుని వెళ్లి మిగతా షూటింగ్ కంప్లీట్ చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. నాకు ఇండస్ట్రీలో మంచి ఎంట్రీ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత మా ఇద్దరికాంబోలో పెద్దగా సినిమాలు రాలేవు అంటూ తెలిపాడు నితిన్.
Read Also : Samantha Post Viral On Social Media : జీవితాంతం అతన్నే ప్రేమిస్తా… పెళ్లి అయిన హీరోపై సమంత కామెంట్లు..!