Nithya Menon Comments On Director : హీరోయిన్ గా నిత్యా మీనన్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆమె నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందరు హీరోయిన్లలాగా సైజ్ జీరో మెయింటేన్ చేయకపోయినా.. బొద్దుగా ఉన్నా సరే అందరితో ముద్దుగా ఉన్నవంటూ కితాబు పొందింది. స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది.
ఈ జనరేషన్ లో ఫిజిక్ తో పని లేకుండా వరుసగా ఛాన్సులు అందుకుంది మాత్రం కేవలం నిత్యా మీనన్ అనే చెప్పుకోవాలి. అలాంటి ఆమె కూడా కొన్ని సార్లు అవమానాలు పడిందంట. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నిత్యా మీనన్ మాట్లాడుతూ.. సినిమాల గురించి నాకు మొదట్లో పెద్దగా అవగాహన లేదు.
ఇలా ఉండాలి, అలా ఉండాలనే ఆలోచన పెట్టుకోలేదు. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో మలయాళంలో ఓ డైరెక్టర్ వద్దకు ఛాన్సుల కోసం వెళ్లాను. అతను నాకు ఛాన్స్ ఇస్తానన్నాడు. కానీ తన మూవీలో కొంచెం ఎక్స్ పోజింగ్ ఉంటుందని.. ఓ చోట నడుము చూపించాల్సి ఉంటుందని చెప్పాడు.
మీరు ఒకసారి మీ నడుము చూపించండి.. ఆ సీన్ లో సరిపోతుందా లేదా అనేది చూస్తాను అని అన్నాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. ఆ సీన్ లేకుండా సినిమా చేయలేమా అని అడిగాను. అతను ఏ సినిమాలో అయినా ఇవి ఇప్పుడు కచ్చితంగా ఉన్నాయి.. నువ్వు హీరోయిన్ కావాలంటే ఇవన్నీ కంపల్సరి అంటూ అన్నాడు. ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత అలాంటి సీన్లు లేకుండానే సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేసింది నిత్యా మీనన్.