Nithya Menon Emotional On Netizens Trolls : నిత్యా మీనన్ అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ జనరేషన్ లో సైజ్ జీరో లాంటి ఫిగర్ లేకపోయినా.. తన అందం, అభినయంతోనే కట్టి పడేసింది. అందుకే ఆమెను ఈ తరం సౌందర్య అంటూ పిలిచేవారు. కత్తిలాంటి సైజులు మెయింటేన్ చేయకపోయినా.. ఆమెకు హీరోయిన్ గా బాగానే ఛాన్సులు వచ్చాయి.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో మాటలు పడాల్సి వచ్చిందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నిత్యా మీనన్. ఆమె మాట్లాడుతూ.. అందరూ ఎదుర్కున్నట్టే నేను కూడా చాలా సార్లు బాడీ షేమింగ్ ఎదుర్కున్నాను.
నేను హీరోయిన్ అయ్యాక.. మధ్యలో కొంత బరువు పెరిగాను. అప్పుడు నా మీద తప్పుడు ట్రోల్స్ చేశాడు. ఎవడితోనే డేటింగ్ చేస్తుందని ఇలా ఎవరికి వారే ఏవేవో ఊహించుకున్నారు. కొందరైతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందేమో అంటూ కామెంట్లు చేశారు. కానీ అసలు ఏమైందని ఒక్కరు కూడా అడగలేదు.
కంటిన్యూగా సినిమా షూటింగుల వల్ల నేను బయట ఫుడ్ తినాల్సి వచ్చింది. దాంతో కాస్త బరువు పెరిగాను. అది తెలుసుకోకుండా ఎవరికి నచ్చింది వారు రాసేసుకున్నారు. ఆడవారిపై ఇలాంటివి అనడానికి కొంచెం కూడా ఆలోచించట్లేదు అంటూ ఎమోషనల్ అయిపోయింది నిత్యా మీనన్.