NOTE: ‘నోటు’ దిస్ పాయింట్..

NOTE: పెద్ద నోట్లు రద్దయి నాలుగేళ్లు దాటిపోయింది. 2016 నవంబర్ 8న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మన దేశంలో చాలా వరకు కొత్త నోట్లే చెలామణి అవుతున్నాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 విలువైన నయా నోట్లనే వాడుతున్నాం. పాత నోట్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి.. స్వీట్ మెమొరీస్ లాగా. అయితే ఈ సరికొత్త నోట్లను ప్రింట్ చేయటానికి దేనికి ఎంత ఖర్చు అవుతుందో చాలా మందికి తెలియదు. […].

By: jyothi

Updated On - Wed - 28 April 21

NOTE: ‘నోటు’ దిస్ పాయింట్..

NOTE: పెద్ద నోట్లు రద్దయి నాలుగేళ్లు దాటిపోయింది. 2016 నవంబర్ 8న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మన దేశంలో చాలా వరకు కొత్త నోట్లే చెలామణి అవుతున్నాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 విలువైన నయా నోట్లనే వాడుతున్నాం. పాత నోట్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి.. స్వీట్ మెమొరీస్ లాగా. అయితే ఈ సరికొత్త నోట్లను ప్రింట్ చేయటానికి దేనికి ఎంత ఖర్చు అవుతుందో చాలా మందికి తెలియదు. దీంతో ఈమధ్య రెగ్యులర్, డిజిటల్, వాట్సప్ తదితర మీడియాల్లో ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. అది ఆసక్తికరంగా కూడా ఉంది.

ఒక్కోదానికి.. ఒక్కో రేటు..

2018వ సంవత్సరం నాటి లెక్కల ప్రకారం 10 రూపాయల నోటును ముద్రించటానికి ఒక రూపాయికి పైగా (రూ.1.01పై) ఖర్చవుతోంది. 50 రూపాయల నోటును ప్రింట్ చేయటానికి కూడా సరిగ్గా ఇదే బడ్జెట్ కేటాయిస్తున్నారు. 20 రూపాయల నోటును అందుబాటులోకి తేవటానికి కరెక్టుగా ఒక్క రూపాయిని వెచ్చిస్తుండటం గమనార్హం. అంటే రూ.10, రూ.50 నోట్ల ముద్రణా వ్యయం కన్నా రూ.20 నోట్ ప్రింటింగ్ ప్రైసే ఒక్క పైసా తక్కువన్న మాట.

ఇక్కడి నుంచి పెరుగుడే..

100 రూపాయల నోటు దగ్గర నుంచి 2000 రూపాయల నోటు వరకు ముద్రణ ఖర్చు పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. 100 రూపాయల నోటును ప్రింట్ చేయటానికి రూపాయిన్నర కన్నా ఒక పైసా ఎక్కువే (రూ.1.51పై) ఇవ్వాలి. 200 రూపాయల నోటు ముద్రణకు 2 రూపాయల ఒక పావలా చొప్పున భారం భరించాలి. 500 రూపాయల నోటు ప్రింటింగ్ కోసం 2 రూపాయల 57 పైసలు చెల్లించాలి. ఇక చివరగా 2000 రూపాయల నోటును ముద్రించాలంటే అత్యధికంగా 4 రూపాయల 18 పైసలు చేతులారా ఇవ్వాలి.

పాత రేట్లు వేరు..

పాత 500 రూపాయలు, పాత 1000 రూపాయల నోట్లు ప్రస్తుతం చెల్లవనుకోండి. అది వేరే విషయం. అయితే వాటి ప్రింటింగ్ కి అప్పట్లో ఎంత ఖర్చయ్యేదో కూడా తెలుసుకుందాం. పాత 500 రూపాలయల నోటును ప్రింట్ చేయటానికి కొత్త 500 రూపాయల నోటు కన్నా 52 పైసలు ఎక్కువే (రూ.3.09పై) ఇవ్వాల్సి వచ్చేది. ఇక పాత 1000 రూపాయల నోటు ముద్రణకు కొత్త దానికన్నా 64 పైసలు తక్కువే వ్యయం అయ్యేది. అయితే ఈ ఖర్చులకు సంబంధించి కొన్ని కొన్ని మీడియా సంస్థలు వేర్వేరు డేటాలను వెల్లడిస్తున్నాయి. కాబట్టి తుది నిర్ణయానికి వచ్చే ముందు మరోసారి అఫిషియల్ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని మనవి.

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News