Note-Vote : కోట్లాధిపతిని ఓడించిన.. పూరిగుడిసె వాసి..

Note-Vote: ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే ఏం కావాలి?. కోట్ల రూపాయల డబ్బు కావాలి. ఎక్కువ మంది చెప్పే సమాధానం ఇదే. కానీ కోటి రూపాయలు కాదు కదా కనీసం లక్ష రూపాయలు కూడా లేని ఓ వ్యక్తి ఒక కోట్లాధిపతిని ఓడించాడు. తమిళనాడులో సీపీఐకి చెందిన కె.మారిముత్తు అనే ప్రజానాయకుడు ఈ ఘనత సాధించాడు. తిరువారూర్ జిల్లాలోని తిరుతురైపూండి నియోజకవర్గంలో ఈ అద్భుతం జరిగింది. కె.మారిముత్తుకి ఉండటానికి పక్కా ఇల్లు కూడా లేదు. పూరిగుడిసెలో ఉంటున్నాడు. […].

By: jyothi

Published Date - Wed - 5 May 21

Note-Vote : కోట్లాధిపతిని ఓడించిన.. పూరిగుడిసె వాసి..

Note-Vote: ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే ఏం కావాలి?. కోట్ల రూపాయల డబ్బు కావాలి. ఎక్కువ మంది చెప్పే సమాధానం ఇదే. కానీ కోటి రూపాయలు కాదు కదా కనీసం లక్ష రూపాయలు కూడా లేని ఓ వ్యక్తి ఒక కోట్లాధిపతిని ఓడించాడు. తమిళనాడులో సీపీఐకి చెందిన కె.మారిముత్తు అనే ప్రజానాయకుడు ఈ ఘనత సాధించాడు. తిరువారూర్ జిల్లాలోని తిరుతురైపూండి నియోజకవర్గంలో ఈ అద్భుతం జరిగింది. కె.మారిముత్తుకి ఉండటానికి పక్కా ఇల్లు కూడా లేదు. పూరిగుడిసెలో ఉంటున్నాడు. పాతికేళ్లకుపైగా (1994 నుంచి) పాలిటిక్స్ లో కొనసాగుతున్నాడు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో నామినేషన్ వేసే నాటికి అతని చేతిలో రూ.3000 మాత్రమే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ లో రూ.60 వేలు, భార్య చేతిలో రూ.వెయ్యి, ఆమె ఖాతాలో రూ.80 వేలే ఉన్నాయి. కె.మారిముత్తు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 60 వేలు కూడా అతనివి కాదు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చింది. ఇల్లు బాగు చేయించుకోమని.

కట్టెల పొయ్యి..

కె.మారిముత్తు ఇంట్లో ఎల్పీజీ సిలిండర్, స్టౌ సైతం లేవు. ఎందుకంటే సిలిండర్ ని రీఫిల్ చేయించుకునేంత స్థోమత అతని కుటుంబానికి లేదు కాబట్టి. మొన్నటి ఎలక్షన్ లో తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ పేరుతో కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ అలయెన్స్ లో సీపీఐ కూడా ఉంది. ఆ కూటమి తిరుతురైపూండి నియోజకవర్గంలో కె.మారిముత్తును తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ప్రత్యర్థి పార్టీ అయిన అధికార పార్టీ (అన్నాడీఎంకే) సురేష్ కుమార్ అనే క్యాండేట్ ని బరిలో నిలిపింది. అతను కోటీశ్వరుడు. అయినప్పటికీ సురేష్ కుమార్ కన్నా కె.మారిముత్తుకే 29,102 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సురేష్ కుమార్ కి మొత్తం 66,683 ఓట్లు రాగా కె.మారిముత్తుకు మాత్రం 95,785 ఓట్లు వచ్చాయి.

Note-Vote

అందరు వేరు.. ఈయన వేరు..

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది కామ్రేడ్లు తమ పేరిట కనీసం కోటి రూపాయల స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లలో చూపారు. కానీ వాళ్లతో పోల్చితే కె.మారిముత్తు ఆర్థిక పరిస్థితి వేరు. తిరుతురైపూండి అనేది రిజర్వ్ డ్ నియోజకవర్గం. కె.మారిముత్తు సీపీఐ కొత్తూర్ యూనియన్ కి దశాబ్ద కాలంగా కార్యదర్శి. ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తనకు స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన డబ్బులను ఈ మారిముత్తు మరో నిరుపేదకి సాయం చేశాడు. సమాజం పట్ల అంత బాధ్యతగా ఉంటాడు. అందుకే ఆ సమాజమే ఆయనకు పట్టం కట్టింది.

Latest News

Related News