Upendra : ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని రోజులుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. హీరోల బర్త్ డేకు వారి పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి రీ రిలీజ్ అవుతున్న సినిమాను మాత్రమే మనం చూస్తున్నాం. ఒక ఒక సినిమా ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ అయింది. ఈ విషయం చాలామందికి తెలియదు.
ఆ సినిమానే ఓం`. ఇదో కన్నడ సినిమా. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఈ సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించారు. పార్వతమ్మ రాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. అండర్ వరల్డ్ డాన్ జీవితం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తీశారు. అప్పట్లో ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కన్నడలో ఓ ట్రెండ్ ను సెట్ చేసింది.
1995 మే 19న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా రూ.2కోట్ల బిజినెస్ చేసింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. కన్నడ ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్ ఎంపిక అయ్యారు. కాగా ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమాను ప్రతి రెండు వారాలకు ఒకసారి రీ రిలీజ్ చేశారు.
బెంగళూరులోని కపిల్ అనే థియేటర్ లో ఓం సినిమాను 30 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇలా అన్ని థియేటర్లలో కలిపి ఈ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు రీ రిలీజ్ అయిన సినిమాగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది ఈ సినిమా. ఈ మూవీ విడుదలైన 20 ఏండ్లకు ఈ మూవీ రైట్స్ ను రూ.10 కోట్లకు అమ్మడం విశేషం.
Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం బట్టల్లేకుండా యాక్ట్ చేస్తా.. స్టార్ హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్..!
Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం బట్టల్లేకుండా యాక్ట్ చేస్తా.. స్టార్ హీరోయిన్ బోల్డ్ స్టేట్ మెంట్..!