Pavitra Lokesh Comments Are Going Viral On Social Media : నటి పవిత్ర లోకేష్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె సీనియర్ నరేశ్ తో ఇప్పుడు డేటింగ్ చేస్తోంది. అరవై ఏండ్లు ఉన్న నరేశ్ తో 40 ఏళ్లు ఉన్న పవిత్ర డేటింగ్ చేయడం అందరికీ ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. కాగా పవిత్రకు గతంలోనే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి.
నరేశ్ కు మూడు పెళ్లిల్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతితో మాత్రం ఇంకా విడాకులు తీసుకోలేదు నరేశ్. కానీ విడిపోయాడు. ఈ క్రమంలోనే పవిత్రతో కలిసి ఒకే ఇంట్లోనే జీవిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి రీసెంట్ గా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు.
ఇందులో వీరిద్దరి వ్యక్తిగత విషయాలను కూడా జోడించారు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో పవిత్ర చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ కన్నడ ఛానెల్ లో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. ఇప్పుడంటే నేను మంచి పొజీషన్ లో ఉన్నాను గానీ.. మొదట్లో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. అవకాశాలు ఇచ్చేవారిని చూస్తే భయం అయ్యేది. నా నుంచి వారు ఏం ఆశిస్తున్నారో అని టెన్షన్ పడేదాన్ని.. ఎందుకంటే ఇలాగే ఓ స్టారో హీరో అవకాశాల పేరుతో నన్ను వాడుకుని వదిలేశాడు’ అని పవిత్ర తెలిపింది. ఆ హీరో పేరు మాత్రం బయటకు రివీల్ చేయలేదు పవిత్ర.
Read Also : Sri Reddy Accused Hero : ఆ హీరో నన్ను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!