Pavitra Lokesh Warning Sri Reddy : పవిత్ర లోకేష్ పేరు ఈ నడుమ ఎంతగా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ఇప్పుడు సీనియర్ నరేశ్ తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని చెబుతూ.. స్టేజిల మీదనే ముద్దులు పెట్టుకుంటున్నారు.
ఇలా పవిత్ర పేరు టాలీవుడ్ లో మార్మోగుతోంది. ఇదిలా ఉండగా పవిత్ర లోకేష్ గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల మీద స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఏ ఇండస్ట్రీలో అయినా సరే కాస్టింగ్ కౌచ్ అనేది మహిళలకు ఉంటుంది.
కాకపోతే దాన్ని ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో కొందరు ఛాన్సుల కోసం కమిట్ మెంట్లు ఇచ్చేస్తారు. వారే తప్పు చేసి మళ్లీ ఏదో జరిగిపోయినట్టు బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ అంటూ వాదిస్తున్నారు. వారేం చిన్న పిల్లలు కాదు కదా. చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు నా దృష్టిలో చాలా పెద్దవి.
ఇష్ట పూర్వకంగా కలుసుకున్నప్పుడు మళ్లీ కాస్టింగ్ అంటూ డ్రామాలు ఆడటం దేనికి. వారిద్దరూ తమ ఇష్టంతోనే ముందుకు వెళ్తారు. తాము అనుకున్నది దక్కకపోతే మళ్లీ వారే గోల చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు అంటూ పవిత్ర లోకేష్ సంచలన కామెంట్లు చేసింది. అందుకే ఆమెను తరచూ శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ ఉంటుంది.