Pawan Kalyan And Anna Lezhneva Divorce New Update : పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రత్యర్థులకు ఆయన మూడు పెళ్లిళ్ల మ్యాటర్ అనేది పెద్ద ఆయుధంగా మారిపోయింది. పదే పదే ఇదే విషయం మీద పవన్ ను వారు విమర్శిస్తూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ప్రత్యర్థులు కోరుకున్నట్టే పవన్ జీవితం సాగుతోంది.
ఇప్పటికే ఆయన ఇద్దరితో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అన్నా లెజినోవాతో ఉంటున్న ఆయన.. త్వరలోనే ఆమెతో కూడా విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త సంచలనం రేపుతోంది. రష్యాకు చెందిన అన్నా లెజినోవాను 2013 లో పెళ్లి చేసుకున్నాడు పవన్. తీన్మార్ సినిమా టైమ్ లోనే ఇద్దరి నడుమ ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్లింది.
వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. పదేండ్ల పాటు బాగానే ఉన్న వీరు.. ఇప్పుడు వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం అన్నా లెజినోవా తన సొంత దేశం రష్యాకు వెళ్లిపోయింది. కొందరు సింగపూర్ వెళ్లిందని చెబుతున్నా.. అందులో నిజం లేదు. ఆమె నిజంగానే రష్యా వెళ్లిపోయింది. పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది.
సంపాదించన డబ్బులు దాచుకోకపోవడం, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవడం వల్లే ఆమె విసుగు చెంది వెళ్లిపోయినట్టు కొందరు చెబుతున్నారు. ఆమె తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. చూస్తుంటే త్వరలోనే ఇద్దరూ విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే పవన్ జీవితంలో మరో చేదు సంఘటన తప్పదు.
Read Also : Sri Reddy Accused Hero : ఆ హీరో నన్ను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!